Call your MP – Telugu Sample Script

Telugu:

నమస్తే నా పేరు (మీ పేరు చెప్పండి). నేను శక్తి “కాల్ యువర్ ఎం. పి .” కాంపెయిన్ తరపున మిమ్మల్ని మహిళా రిజర్వేషన్ బిల్లు  ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టమని అభ్యర్ధిస్తున్నాను. దయచేసి మహిళా రిజర్వేషన్ బిల్ ను ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో చర్చకు తీసుకుని రండి. 70 ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చినా పార్లమెంట్ లో మాత్రం మహిళలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నారు. మహిళా సాధికారత కోసం, సమానత్వం కోసం, రాజకీయ పరంగా మహిళలకు ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకోడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ముఖ్యమైనది.
మీరు మా ప్రజా ప్రతినిధులు కాబట్టి మిమ్మల్ని ఈ చివరి పార్లమెంట్ సెషన్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టమని మా అభ్యర్ధన. మా అభ్యర్ధన మన్నిస్తారు కదూ?
(వారి స్పందన అవునో /కాదో వినండి)

ధన్యవాదాలు

దయచేసి ఎం.పీ . ఇచ్చిన సమాధానాన్ని అవును/కాదు అని మాకు ఆ  ఎం.పీ . పేరు, సమాధానం  ఈ నెంబరుకు +91 9341941945 SMS చెయ్యండి